new Covid-19 vaccine to be tested on humans in UK
ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసే దిశగా బ్రిటన్ కోవిడ్ 19 వాక్సిన్ ప్రయోగాలను మరింత వేగవంతం చేసింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వాక్సిన్ ను ఇవాళ్టి నుంచి బ్రిటన్ లో వందలాది మంది పై ప్రయోగించనుంది. 18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన ఆరోగ్యవంతులపై పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు వారాల పాటు ఈ ప్రయోగాలు జరగనున్నాయి. మనుషులతో ప్రయోగాన్ని పరీక్షించడం సాధారణ రోజుల్లో అయితే కొన్నేళ్లు పట్టేదని UK ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కోవిద్ 19 వాక్సిన్ ను మానవులపై పరీక్షలు చెయ్యడం ద్వారా ముఖ్యమైన సమాచారం రాబట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇది అత్యుత్తమ వాక్సిన్ అని దీనిని ప్రయోగించడం వలన మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఈ టీకాను ఒక సారి ప్రయోగిస్తే వైరస్ మల్లి వచ్చే అవకాశం లేదంటున్నారు.
రెండో విడతలో 70 పై పడ్డ వారిపై ప్రయోగాలు చేస్తారని, 18 ఏళ్ల వయసు పైబడ్డ 500 మంది పై ప్రయోగం చెయ్యనున్నారు. అయితే వాక్సిన్ డోస్ సగం మాత్రమే ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రయోగాలు చేసేందుకు సరిపడా వాక్సిన్ ను స్టోర్ చెయ్యడం జరిగింది అన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జర్నల్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ నాటికి 10 లక్షల డోసుల టీకాలను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జూన్ నాటికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వాక్సిన్ లు మంచి ఫలితాలు ఇస్తే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది డోసులు అవసరమవుతాయి. అప్పుడే ఈ మహమ్మారి అంతం అవుతుంది. ప్రపంచం లాక్ డౌన్ నుంచి ముక్తి లభిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. సామాజిక దూరం స్వీయ రక్షణకే పరిమితమవుతుంది. టీకాతోనే ఈ వైరస్ ను పూర్తిగా నిర్ములించే అవకాశం ఉంది. త్వరలోనే టీకాలు సాధారణ మానవుని చేరువయ్యి, ప్రపంచం ఈ మహమ్మారి నుండి ముక్తి పొందాలని ఆశిద్దాం.