హోమ్ ఐసొలేషన్ లో ఉండేవారికి కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారు 17రోజులవరకు ఇంట్లోనే ఐసొలేషన్ లోనే ఉండాలని, ఐసొలేషన్ లో ఉన్నవారికి సాధారణంగా ఒక వారం రోజుల లో లక్షణాలు తగ్గుతాయని అప్పుడు వారికి మరలా టెస్ట్ చేస్తామని తెలిపింది. ఇలా హోమ్ ఐసొలేషన్ లో ఉండేవారికి జనరల్‌గా ఓ వారం రోజుల్లో కరోనా లక్షణాలు తగ్గిపోతాయి. అందువల్ల వారం తర్వాత వారికి టెస్ట్ చేస్తారు. వారం తర్వాత నుంచి చివరి 10 రోజులూ కరోనా లక్షణాలు లేకపోతే అప్పుడు 18వ రోజున ఐసొలేషన్ నుంచి బయటకురవచ్చని పేర్కొంది.
అలా కాకుండా వారం తరవాత కూడా లక్షణాలు కనిపిస్తే వారి ఐసోయేషన్ పీరియడ్ ను 28రోజుల అమలు అవుతుంది. ప్రస్తుతం పాటిస్తున్న హోం ఐసోలేషన్‌కు కేంద్రం సూచించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం 17 రోజుల తర్వాత టెస్టులేవీ ఉండవు. అయితే కేంద్రం నిబంధనల ప్రకారం వ్యాధి లక్షణాలు ఉన్నవారికి మాత్రమే ఐసొలేషన్ పూర్తైన తర్వాత ఆర్టిపీసీఆర్ టెస్ట్ చేస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి డిశ్చార్జ్ సమయంలో లక్షణాలు ఉంటేనే టెస్ట్ చేస్తారు. లక్షణాలు లేని వారిని నేరుగా డిశ్చార్జ్ చేస్తారు. డిశ్చార్జి అవుతున్న వారితో కరోనా సోకుతున్నట్లు కేసులు ఏమి రానందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కానీ ఈ నిర్ణయాన్ని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తంచేస్తునట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: తమిళనాట బారిగా పెరిగిన కరోనా కేసులు