ఏపి లో దుకాణాలు తెరిచేందుకు కొత్త మార్గ దర్శకాలు జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. కంటైంమెంట్ జోన్లు, బఫర్ జోన్లు కాకుండా మిగిలిన ప్రాంతాలన్నిటికి అనుమతులు ఇవ్వడమైనది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరవాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్లు జారీ చేసింది.
కాగా పండ్లు, కూర గాయాల షాపులను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అనుమతిచ్చింది. కాగా పట్టణాలలో షాపింగ్ కాంప్లెక్స్ లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. బంగారు ఆభరణాలు, చెప్పులు, బట్టలు దుఖానాలకు అనుమతిని నిరాకరించింది. కాగా ఈ అనుమతులు మాత్రం కంటైంమెంట్ జోన్లు, బఫర్ జోన్లు కాకుండా మిగిలిన ప్రతాలకు మాత్రమే అని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే లాక్ డౌన్ మార్గ దర్శకాలను ఎవరైనా ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: విశాఖ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందచేసిన రాష్ట్ర ప్రభుత్వం