Monday, May 10, 2021

Latest Posts

గృహహింసకు పాల్పడితే కోరంటైన్కు వెలల్సిందే

New punishment for husbands who domestic violence

భారతదేశం కరోనా వల్ల  లోక్ డౌన్ లో ఉంది కానీ ఇంట్లో ఇల్లాలికి మాత్రం పని ఒత్తిడి ఎక్కువైంది. లాక్ డౌన్ వల్ల పిల్లలు పెద్దలు ఇళ్లకే పరిమితం కావడంతో వారికి కావలసినవి చేసే పనిలో వాళ్లు నిమగ్నమై, వారికి విశ్రాంతి లేకుండా పోయింది.  ఇలాంటి టైమ్ లో కొందరు మగవారు  వారిని హింశిస్తున్నారు. అలాంటి గృహహింస కేసులు జాతీయస్థాయిలో అధికమవుతున్నాయి.  ఒక్క మహారాష్ట్రలో గడిచిన నెల రోజుల్లో ఈ గృహహింస కేసులు ఎక్కువగా నమోదయ్యాయి అందువల్ల  పూణే జిల్లా పరిషత్ అధికారులు భార్యలను దూషించడం, దాడి చేయడం చేస్తున్న భర్తలకు కొత్తరకం శిక్షలు విధిస్తున్నారు.  లాక్ డౌన్ టైం లో వారికి ఆల్కహాల్ లభించకపోవడంతో తాగడానికి అలవాటు పడ్డ మగాళ్ళు మానసిక ఒత్తిడికి లోనై  భార్యను వేధిస్తున్నారు అలాంటి భర్తలపై గృహహింస కేసు నమోదైతే ఇన్ స్ట్యూషన్ కోరంటైన్ కు వాళ్ళను పంపుతున్నారు.

భార్యలపై ప్రతాపం చూపే భర్తల కోసం పూణే జిల్లాలో విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీలో  స్త్రీ, శిశు సంక్షేమం శాఖ, అంగన్వాడి, పంచాయతీ సమితిలు, స్వయం సహాయక బృందాలు సభ్యులుగా ఉంటారు.  ఈ సభ్యులు గ్రామ పంచాయతీల్లో వార్డుల్లో ఇంటింటికి వెళ్లి గృహ హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు.  అలాగే హెల్ప్లైన్ నెంబర్లు పెట్టి సైకియాట్రిస్టులు ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. విజిలెన్స్ కమిటీ సభ్యులతో పాటు గ్రామీణ పోలీసులు మొదలగువారు కోఆర్డినేట్ చేస్తూ గృహహింసకు పాల్పడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా రు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss