Sunday, June 13, 2021

Latest Posts

ఒలింపిక్స్‌ డేట్స్ ఫిక్స్  

Tokyo Olympic New dates announced:

ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్   మహమ్మారి   కరోనా వైరస్‌ కారణంగా వాయిదా వేస్తూ జపాన్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఒలంపిక్స్ జరిగే తేదీలను కూడా ప్రకటించింది.    2021 జూలై 23 నుంచి ఒలింపిక్స్‌ను నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.

టోక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్నాయి. ఇక  2021, ఆగస్ట్ 8తో ఒలింపిక్స్ క్రీడలు ముగియనున్నట్లు ఐఓసీ తెలిపింది.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాచడంతో ఒలింపిక్స్‌-2020ను నిర్వహించలేని పరిస్థితి రావడంతో  వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), నిర్వాహక జపాన్‌ చారిత్రక నిర్ణయం తీసుకున్నాయి.

అయితే  ఇంత ఎక్కువ కాలం ఒలింపిక్స్ క్రీడలు వాయిదా పడటం ఒలింపిక్స్ చరిత్రలోనే ఇదే  తొలిసారి. అన్ని దేశాలను కరోనా వణికిస్తున్న నేపథ్యంలో   పారాలింపిక్స్ ఇప్పటికే వాయిదా పడి 2021 ఆగస్ట్ 24  నుంచి సెప్టెంబర్ 5 మధ్య నిర్వహించబోతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss