Thursday, December 2, 2021

Latest Posts

హెచ్చరిస్తున్న ఐక్యరాజ్యసమితి

New United Nations Climate Change Report

వేడి తరంగాలు, కరువు, వరదలు మరియు హిమానీనదాలు సన్నబడటం వంటి విపరీతమైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం చోటు చేసుకుంటున్నాయి. వీటి ఆధారంగా తెలుస్తుంది ప్రపంచ పర్యావరణం ఎంత ప్రమాదపు అంచున ఉన్నది. వీటికి గల కారణం మానవ ప్రవర్తనతో సంబంధం కలిగి ఉన్నాయి మరియు సహజ కారణాలతో కాదు అంటు ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తల తాజా అంచనా నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం వాతావరణ లోని కొన్ని మార్పులు కోలుకోలేనివి కూడా కావచ్చు అంటు పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నుండి వచ్చిన ఈ నివేదిక “వాతావరణ మార్పు 2021“, ఇటీవలి వాతావరణ తీవ్రతలు వేల సంవత్సరాలలో ఇలాంటి ఎన్నడు చూడలేదని చెబుతున్నాయి.

రాబోయే ప్రమాదం తప్పిపోవాలంటే పారిస్‌ ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా రెండింతలు అధికంగా, వేగంగా కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిఉంటుందన్నారు. 2015 ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం భూఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగత్రలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయిల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉన్నాయి. అంటే ప్రపంచం ముప్పునకు చాలా దగ్గరగా ఉందని తెలుస్తోంది. అందువల్ల  తీవ్రమైన కాలుష్య నివారణ చర్యలను పాటించి ఉద్గారాల నియంత్రణ చేపట్టాలి. ప్రస్తుతమున్న స్వల్పకాలిక ప్రణాళికలను కొనసాగిస్తే అప్పుడే ఈ ఉత్పాదం నుంచి తప్పించుకోవచ్చని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది.

ఇది కూడా చదవండి:   

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss