Home క్రీడలు బయో బబుల్ ని బ్రేక్ చేసిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు బి‌సి‌సి‌ఐ సీరియస్

బయో బబుల్ ని బ్రేక్ చేసిన న్యూజిలాండ్‌ ఆటగాళ్లు బి‌సి‌సి‌ఐ సీరియస్

New Zealand Players Break Bio Bubble Rules, BCCI Complains To ICC, 99Telugu,BCCI, ICC, New Zealand Players, NZ Players Bio Bubble, World Test Championship Final 2021, WTC 2021, NZ vs India Final

New Zealand Players Break Bio Bubble Rules

రేపు జూన్‌ 18న భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2021 ప్రారంభం కానుంది. అయితే ప్లేయర్స్ కరోనా బారీన పడకుండా ఉండడం కోసం ఐ‌సి‌సి కొన్ని కటినమైన నిర్ణయాలు తీసుకుంది. ఎవరు బయో బబుల్ దాటి బయటకు వెళ్లకూడదని చెప్పింది. అయితే నిన్న  కొందరు కివీస్‌ ఆటగాళ్లు కరోనా నిబంధనలను అతిక్రమంచి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని తెలిసింది.

ఇందులో న్యూజిలాండ్ ప్లేయర్స్ ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్ ఇలా పలువురు ఆటగాళ్లు బయో బబుల్ ని విడిచి వెళ్లారని తెలిసింది. ఈ విషయం ప‌ట్ల భారత జట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది కచ్చితంగా బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్టేనని టీమిండియా మేనేజ్‌మెంట్ వాదిస్తోంది. ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది.

అయితే దీనిపై న్యూజిలాండ్‌ బృందం స్పందించింది. ప్లేయర్స్ కి ఇచ్చిన హోటల్, గోల్ఫ్ కోర్సు ఒకే ప్రాంగణంలో ఉన్నందున తమ ఆటగాళ్లు గోల్ఫ్‌ ఆడేందుకు వెళ్లారని, ఇది బయో బబుల్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినట్లు కాదని ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ వాదిస్తోంది. మరి ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Exit mobile version