Sunday, January 24, 2021

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో కలిసి దిగిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. ఆమె వివాహ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

రిచ్​ లుక్​తో ఉన్న ఈ పెళ్లి శుభలేఖ అందరినీ ఆకట్టుకుంటోంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో రాజస్థాన్ చేరుకోనున్న మెగా కుటుంబ సభ్యులు.. కొన్నిరోజుల క్వారంటైన్​లో ఉండి వేడుకకు హాజరవుతారు. ఆ తర్వాత 11వ తేదిన హైదరాబాద్​లో రిసెప్షన్​ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు ఇంకా ఏడు రోజులే ఉందని నిహారిక తెగ సంతోషపడిపోతుంది. రిచ్​లుక్​లో ఉన్న శుభలేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss