Friday, March 5, 2021

Latest Posts

కోర్టుకెక్కిన నిమ్మగడ్డ – సర్వత్రా ఉత్కంఠ

Nimmagadda Ramesh kumar files petition in highcourt over ordinance issue

తనను ఈసీగా తొలగించడంపై హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ రిట్ పిటిషన్ వేశారు. ఆర్టికల్ 243కే ప్రకారం తనను తొలగిస్తూ జారీ చేసిన జీఓ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో ఈసీని మారుస్తూ..ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని పిటిషన్‌లో తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ఇవ్వటం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఫిర్యాదులపై స్పందించానని..అందుకే ఇలా చేశారని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రిట్ పిటిషన్ విచారణకు ధర్మాసనం అనుమతించింది. సోమవారం రిట్ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.

కాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ,.. రాష్ట్రంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ను తప్పించి కొత్తగా జస్టిస్‌ కనగరాజ్‌‌ నియమకాన్ని న్యాయస్థానాలు తప్పుపడతాయని తాను అనుకోవడంలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే, గతంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇచ్చాయని..వాటిని భేఖాతరు చేశారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై కోర్టు తీర్పు ఇస్తే.. అప్పుడైనా ముఖ్యమంత్రి నైతిక విలువలకు కట్టుబడతారా? అని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. కొత్త ఎస్‌ఈసీని తీసుకొచ్చేందుకు రమేష్‌ పదవీకాలం కుదిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమన్నారు. మండలికి వచ్చే ఈ ఆర్డినెన్స్‌ని అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. విశ్రాంత న్యాయమూర్తి అయిన కొత్త కమిషనర్‌.. చట్టాలు తెలిసి కూడా బాధ్యతలు చేపట్టడం సరికాదని యనమల పేర్కొన్నారు. కనీసం సరిచేసుకునే ప్రయత్నం కూడా జగన్ చేయడం లేదని, ఇప్పటికే రమేష్‌కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని యనమల తెలిపారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss