Saturday, January 23, 2021

Latest Posts

నిమ్మగడ్డ పిటీషన్ పై విచారణ వాయిదా

Nimmagadda Ramesh Kumar Petition Adjourned By Court

ఎస్ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌‌పై సోమవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. నిబంధనలు మార్చి తనను పదవి నుంచి తొలగించారంటూ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
అలాగే రమేష్ కుమార్ తొలగింపుపై టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. కాగా బిజెపి ప్రతినిధి సాయి కృష్ణ మాట్లాడుతూ రమేష్ కుమార్ ముందుచూపుతో ఎన్నికలు వాయిదా వేశారని,ఎన్నికలు జరిగి ఉంటే… ఎన్ని ప్రాణాలు పోయేవో… పరిస్థితి ఊహించుకోవాలని వ్యాఖ్యానించారు.

కరోనా సమయంలో టిడిపి రాజకీయాలు చేస్తోందని వైసిపి నేతలు అంబటి రాంబాబు తదితరులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కమీషనర్ నిబంధనలు మార్చడం,కొత్త కమీషనర్ ని వేయడం సమర్ధించారు. అయితే విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ఇలా ఎన్నికల అధికారిని మార్చడం,నిబంధనలు మార్చడం వంటి చిల్లర రాజకీయాలు చేసిన ఘనత వైసీపీదేనని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం సలహాలు ఇస్తుంటే విమర్శలు అనుకోవడం వింతగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో కమీషనర్ ని మార్చడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss