వరంగలో ఒక విషాధ సంఘటన చోటు చేసుకుంది, గీసుకొండ మండలం గోర్రకుంట శివారులో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న బహిరంగ బావిలో ఒక కుటుంబంలో ఆరుగురితో సహా తొమ్మిది మంది చనిపోయారు. గురువారం సాయంత్రం నాలుగు మృతదేహాలు లభించగా, ఈ రోజు ఉదయం ఐదు మృతదేహాలు లభించాయి.
20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి వరంగల్ కు వలస వచ్చిన ఈ కుటుంబం గోనె సంచులు కుడుతూ జీవనం సాగిస్తూ ఉంది. మసూద్, నిషా దంపతులకు ఇద్దరు కొడుకులు సోహైల్, షాబాద్ తో పాటు భర్తతో విడాకులు తీసుకున్న కూతురు మరియు మనవడు కూడా వారితో ఉంటుంది. అతని భార్య, కుమార్తె, మూడేళ్ల మనవడు, కుమారులు సోహైల్, షాబాద్, త్రిపురకు చెందిన షకీల్ అహ్మద్, బీహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్ మృతదేహాలు బహిరంగ బావిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు
లాక్ డౌన్ కారణంగా వీరి కుటుంబం పారిశ్రామిక ఓడలోని సాయి దత్త ట్రేడర్స్ లోని భవనంలో ఉంటుంది. వారు గోడౌన్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక గదిలో ఉండగా, బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు మొదటి అంతస్తులోనే ఉన్నారు.కాగా అక్కడికి వచ్చిన ట్రేడర్స్ యజమాని వారు కనిపించకపోవటంతో చుట్టూ ప్రక్కల వెతుకగా పక్కనే ఉన్న బావిలో మృతదేహాలు కనపడ్డాయి, దీనితో ట్రేడర్స్ యజమాని పోలీసులకు సమాచారం అందించగా వారి ఫోన్ నంబర్ ల ఆధారంగా ట్రేస్ చెయ్యడం స్టార్ట్ చేశారు. కాగా మిగిలిన ఇద్దరు కొడుకులు ఆచుకు కనిపించకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ సాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: