Friday, January 22, 2021

Latest Posts

ఉరి మళ్ళీ వాయిదా – నిర్భయ తల్లి షాకింగ్ కామెంట్స్

Nirbhaya convicts will not be hanged Today:

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఉరిశిక్ష అమలు వాయిదా వేస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది. కొత్త తేదీలపై కోర్టు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.

వాయిదాకు ముందు నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. అయితే ఆ వెంటనే పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ ఈ మెర్సీ పిటిషన్ వేశారు. దీంతో రాష్ట్రపతి ముందు దోషులలో ఒకరి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ దోషులను ఉరితీయరాదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు మరోసారి వాయిదా పడింది.

కాగా ఉరిశిక్షపై ఢిల్లీ కోర్టు మరోసారి స్టే విధించడంపై బాధితురాలి తల్లి షాకింగ్ కామెంట్స్ చేసారు. ఉరిశిక్ష పదే పదే వాయిదా పడడం మన ‘‘వ్యవస్థ వైఫల్య’’మంటూ ఆమె కంటతడి పెట్టారు. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు ఆవరణంలోనే కూలబడిన ఆమె కొద్ది సేపు వెక్కి వెక్కి ఏడ్చారు. ‘‘దోషులను ఉరితీయాలంటూ ఇచ్చిన సొంత ఆదేశాలను అమలు చేయడానికి కోర్టు ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నట్టు? ఉరిశిక్షను పదేపదే వాయిదా వేయడం మన వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తోంది. మన వ్యవస్థ మొత్తం నిందితులకే మద్దతు ఇస్తుంది. ఈ కేసులో కోర్టు ఏమి చేస్తుందో ప్రపంచం మొత్తం చూస్తోంది’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss