Saturday, March 6, 2021

Latest Posts

దేశీయ సంస్థలకే ప్రాధాన్యత

గ్లోబల్ టెండర్ల గురించి ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ కీలక  వ్యాఖ్యలు  చేశారు. 200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లు కేవలం భారతీయ కంపెనీలను మాత్రమే అనుమతించనున్నామని ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. విదేశీ సంస్థలను అనుమతించే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వ కొనుగోళ్ల విషయంలో గ్లోబల్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లను నిరోధించి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను అదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

విదేశీ కంపెనీల నుంచి మన సంస్థలు అనుచిత పోటీని ఎదుర్కొంటున్నాయని, ఇకపై ఈ విధానాన్ని జరగనివ్వబోమని ఆమె  తెలిపారు. ప్రభుత్వ కొనుగోళ్లలో ఇకపై రూ. 200 కోట్ల వరకు ఏ సేకరణ అయినా దేశీయంగానే ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 6 నెలల గడువును పెంచుతున్నట్లు, ప్రస్తుతం ఉన్న టీడీఎస్ రేటును 25 శాతం తగ్గిస్తున్నామని, రేపటి నుంచి 2021 మార్చ్ 31 వరకు ఈ తగ్గింపు రేటు అమల్లో ఉంటుందని తెలిపారు.

అలాగే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద 41 కోట్ల జన్ ధన్ ఖాతాల్లోకి రూ. 52,606 కోట్లను బదిలీ చేశామని, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు రూ. 30 వేల కోట్ల నిధులను, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రూ. 90 వేల కోట్ల సాయాన్ని విడుదల చేస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి: మోడి 20 లక్షల కోట్ల ప్యాకేజీలో మొదటి ఫలం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss