దేశ వ్యాప్తంగా కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు అత్యవసర సర్వీసులు మినహా అన్ని మూతపడ్డాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో పడిపోయింది. దీంతో.. భారత ఆర్థిక వ్యవస్థను గట్టెంకించడానికి మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం నిర్ణయం తీసుకొని ఊహించని విధంగా రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి, కరోనాతో కుదేలైన రంగాలన్నింటికీ ఈ భారీ ప్యాకేజీ గొప్ప ఊరట కల్పించనుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ వాటి వివరాలను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి తెలుపుతారని ప్రకటించారు.
ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ గురించి కీలక ప్రకటన చేయబోతున్నారు . ఈ ప్యాకేజీని ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తున్నారన్నది సాయంత్రం చెప్పబోతున్నారు అలాగే ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో మరికొన్ని గంటలలో క్లారిటీ రానుంది.
Union Finance Minister Nirmala Sitharaman to address the media at 4 pm today. #EconomicPackage (file pic) pic.twitter.com/I1N5JjhkSe
— ANI (@ANI) May 13, 2020
ఇది కూడా చదవండి: మోదీ హెడ్లైన్ అండ్ బ్లాంక్ పేజి ఇచ్చారు – చిదంబరం