Nithin 30 Release Date
మెర్లపాక గాంధీ దర్శకత్వంలో హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం విడుదల తేదీ వచ్చేసింది. ప్రస్తుతం నితిన్ 30 గా పిలువబడే ఈ చిత్రం జూన్ 11 న తెరపైకి రానుంది. ఇప్పటివరకు ఈ రిలీజ్ డేట్ లో ఏ చిత్రం అనౌన్స్ చేయకపోవటంతో ఇప్పుడు ఈ సినిమా సోలో రిలీజ్ అయ్యే అవకాశముంది.
హిందీ హిట్ చిత్రం అంధధూన్ యొక్క అధికారిక రీమేక్ అయిన ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నభా నటేష్ మరియు తమన్నా భాటియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎన్ సుధాకర్ రెడ్డి మరియు నికితా రెడ్డి నిర్మాతలు కాగా, ఈ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో నితిన్ 30వ చిత్రం షూట్ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి: