Tuesday, January 25, 2022

Latest Posts

పవన్ సరసన జోడీగా నిత్యామీనన్

Nithya Menon Join Sets Of PSPK Rana Movie

హీరోయిన్ నిత్యామీనన్ తన తదుపరి చిత్రం అయ్యప్పనమ్ కోషియం రీమేక్‌లో పవన్ కళ్యాణ్ సరసన జత కట్టనుంది. ఇటీవలే షూట్ తిరిగి ప్రారంభమైంది మరియు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఈ సినిమాలో కొన్ని కీలక ఎపిసోడ్‌ల షూటింగ్ చేస్తున్నారు. నిత్యా మీనన్ ఈ రోజు సినిమా సెట్స్‌లో జాయిన్ కానుంది ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో మరో హీరో రానా దగ్గుబాటి పక్కన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా  జతకట్టనుంది.

ఇక ఈ సినిమాను సంక్రాంతి 2022 సందర్భంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అలానే పవన్ ఇందులో ఒక పవర్ ఫుల్ పోలీసు అయిన భీమ్ల నాయక్ పాత్రను పోషించనున్నాడు. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ పర్యవేక్షనలొ షూట్ చేయడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న పవన్ – రానా సినిమాకి థమన్ సంగీత దర్శకుడు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss