Nizamuddin Markaz chief Maulana Saad audio released
ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరగడం, ఇందులో అత్యధికులు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్‌కు వెళ్లొచ్చినవాళ్లే అని తేలడంతో దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. అన్ని రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసులు పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీగానే నమోదయ్యాయి. ఇంకా చాలామంది హాస్పిటల్ కి రాకపోవడంతో వెంటనే వచ్చి చెక్ చేయించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎం లు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు.
ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ వద్ద తబ్లిక్ జమాత్ సమావేశాలు నిర్వహించి కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమైన మౌలానా సాద్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా సాద్ తన అనుచరులకు గురువారం ఆడియో సందేశం విడుదల చేశారు. వైద్యుల సలహా మేర తాను క్వారంటైన్ లో ఉన్నానని, కరోనా వైరస్ ప్రబలకుండా నివారించేందుకు వీలుగా తబ్లీగ్ జమాత్ కార్యకర్తలందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని అయన కోరారు.
తబ్లీక్ జమాత్ కార్యకర్తలందరూ ఇంటికే పరిమితమై ప్రభుత్వ ఉత్తర్వులను పాటించండి అంటూ సాద్ సూచించారు. ఒకవైపు మౌలానా సాద్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తుండగా, మరోవైపు ఆయన గురువారం జమాత్ కార్యకర్తల కోసం ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇప్పటికైనా ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనతో లింక్ ఉన్నవాళ్ళంతా ఆసుపత్రులకు స్వచ్ఛందంగా వస్తారని ఆశిద్దాం.