Monday, May 10, 2021

Latest Posts

కరోనా టెస్ట్ కి ఇప్పటి నుండి డబ్బు కట్టాల్సిందే

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతడం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా ప్రజలందరికీ కరోనా వైరస్ పరీక్షలు జరుపుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్ మినహా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలందరికీ ఉచితంగానే కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇక నుంచి కరోనా నిర్ధారణ పరీక్షలకు డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ మేరకు మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రజలందరికీ భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.

ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రజలు అందరికీ ఉచితంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయలేము అంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇన్ని రోజుల వరకు కరోనా టెస్టింగ్ కిట్లపై ఇచ్చిన సబ్సిడీని ఐసీఎంఆర్ ఉపసంహరించుకోవడం కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేఘాలయ డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. దీంతో ఇన్ని రోజుల వరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత పరీక్షలు చేసుకున్న ఎంతో మంది ప్రజలు ఇక నుంచి కరోనా నిర్ధారిత పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి కరోనా నిర్ధారణ పరీక్ష కైనా సరే ప్రస్తుతం చార్జీలు వసూలు చేయనున్నట్లు మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss