Thursday, December 2, 2021

Latest Posts

నగరంలో వెలసిన నో కిస్సింగ్ జోన్ బోర్డు

No kissing zone

ముంబైలోని బోరివాలి ప్రాంతంలో రోడ్ సైడ్ పార్కింగ్ ప్లేస్ వద్ద రోడ్డుపై ‘నో కిస్సింగ్ జోన్’ అని పెద్దగా రాశారు అక్కడి కాలనీ వాసులు. అది చూసి అందరు షాక్ అవుతున్నారు. నో పార్కింగ్ జోన్ అని రాయబోయి పొరపాటున ఇలా రాశారా అని కొందరు, ఎందుకిలా రాశారని అందరు అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని బోరివలి ప్రాంతంలోని సత్యం శివమ్ సుందరం సొసైటీ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ప్రతీరోజూ సాయంత్రం 5 గంటల నుంచి జంటలు బైకులు, కార్లలో వచ్చి చుట్టుప్రక్కల వారు చూస్తున్నారనే బిడియం, భయం లేకుండా ముద్దులు పెట్టుకోవడం, హగ్స్ ఇచ్చుకోవడం వంటి పనులు చేస్తుండేవారు.

దీంతో విసిగిపోయిన కాలనీ వాసులు జంటల వీడియోలను తీసి స్థానిక కార్పొరేటరుకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించక పోవడంతో తాము ‘నో కిస్సింగ్ జోన్’గా ప్రకటించి బోర్డులు ఏర్పాటు చేసినట్లు అక్కడ నివాసితులు తెలిపారు. ఇంటి బయట కూర్చోవాలన్నా, బాల్కనీలో నిలబడాలన్నా గిల్టీగా ఫీల్ అవ్వడంతో ఇక లాభం లేదనుకుని కాలనీ వాసులంతా ఈ పని చేసినట్లు తెలిపారు. మేం ముద్దులకు వ్యతిరేకం కాదు, కానీ మా కాలనీని మాత్రం కిస్సింగ్ జోన్ గా మార్చనివ్వం అని వారు అంటున్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss