Monday, April 19, 2021

Latest Posts

సూర్య సినిమాలపై నిషేధం…

No more Surya movies in theaters says panneerselvam

కరోనా వ్యాప్తి కట్టడి లో బాగంగా లాక్‌డౌన్ విదించారు. అందువల్ల దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లన్నీ బంద్. దీంతో సినిమాలు విడుదల ఆగిపోయాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు  అమేజాన్ ప్రైమ్, నెటిఫ్లిక్స్ వంటి ఓటీటీల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. అలాగే జ్యోతిక ప్రధాన పాత్రలో ఆమె భర్త, తమిళ స్టార్ హీరో సూర్య నిర్మించిన చిత్రం `పొన్మగల్ వంధాల్` సినిమాకు కూడా బారి అఫ్ఫెర్స్ వచ్చాయి. అలా రావడంతో చిత్రా నిర్మాత ఐనా సూర్య  కూడా   డైరెక్ట్‌గా అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఈ నిర్ణయంపై తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం తప్పు పట్టింది. సూర్యను హెచ్చరిస్తూ తమిళనాడు థియేటర్స్ యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్ సెల్వం ఓ వీడియోను  విడుదల చేశారు. `సినిమాలను పూర్తిగా థియేటర్లను దృష్టిలో ఉంచుకునే తెరకెక్కిస్తారు. సూర్య నిర్మించిన చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కావడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ఓటీటీలో విడుదల చేయాలనే నిర్ణయాన్ని సూర్య వెనక్కి తీసుకోవాలి. లేకపోతే సూర్య నటించిన, నిర్మించిన సినిమాలపై నిషేధం విధిస్తాం. ఆయన సినిమాలను థియేటర్లలో విడుదల కానివ్వమ`ని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. మరి దీనిపై సూర్య ‘పొన్మగల్ వంధాల్’ చిత్రం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో  వేచి చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss