NOC problems over students and employees:
హైదరాబాద్ లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఎన్ఓసి కోసం పోలీసు స్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు. దేశం లో 21రోజులు లాక్ డౌన్ ప్రకటించడం వల్ల హాస్టళ్ళు, హోటల్స్ మూతపడడంతో విద్యార్థులు, ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కడ ఉండాలో తెలియక ఇక్కట్లు పడుతున్నారు. పోలీసుశాఖ వారు ఎన్ ఓ సి జారీ చేయాలని తద్వారా వారు వారి వారి స్వస్థలాలకు చేరుకోవడానికి వెసులుబాటు కలుగుతుందని విద్యార్థులు అడుగుతున్నారు. విద్యార్థుల కోరిక మేరకు వారికి హెల్త్ టెస్ట్ లు చెసి ఎన్ఓసి ను ఇస్తునారు. ఇప్పటికే కొంత మందికి జారీచేసారు. ఇంకా ఎన్ఓసి ల కోసం విద్యార్థులు లు పోలీస్ స్టేషన్లో భారీగా చేరుకున్నారు.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఎన్ఓసి తీసుకుని బయల్దేరిన వారికి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో వాళ్లకి చుక్కెదురైంది. వారిని లోపలికి అనుమతించబోమని, ఒకవేళ లోపలికి వచ్చిన వారు 14 రోజులు పాటు హోంకోరంటైన్ గా ఉండవలసిందిగా మంత్రి ఆళ్ల నానీ ప్రకటించారు.