Thursday, December 2, 2021

Latest Posts

నేటి నుంచి గాంధీ ఆస్పత్రిలో సాధారణ సేవలు

Non-COVID services at Gandhi Hospital

నేటి నుండి గాంధీ ఆస్పత్రిలో సాధారణ వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. గత కొన్ని నెలలుగా కరోనా సేవలకే పరిమితమైన గాంధీఆస్పత్రిలో సాధారణ సేవలు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు అదుపులోకి రావడంతో సాధారణ వైద్యసేవలను అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు పేర్కొన్నారు. కాగా కరోనా సేవలకే ఆస్పత్రి ప్రధాన భవనాన్ని కొవిడ్‌ బ్లాక్‌గా మార్చారు. ఈ భవనంలోని 2, 3వ అంతస్తులను కరోనా చికిత్సకు, 4వ అంతస్తులోని ఈఎన్టీ విభాగాన్ని బ్లాక్‌ఫంగస్‌ బాధితులకు కేటాయించినట్టు తెలిపారు. కానీ ప్రధాన భవనంలో కరోనా సేవల అందిస్తునందున సాధారణ రోగులకు అనుమతి ఉండదని చెప్పారు. ఓపీ బ్లాక్‌లో యథావిధిగా సేవలు కొనసాగుతాయని తెలిపారు. ఓపీ బ్లాక్‌పై అంతస్తులోని ఐసీయూ వార్డులో అత్యవసర సేవలు కొనసాగుతాయని, దశలవారీగా అన్ని రకాల శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు.  మాస్కులు ధరించినవారినే మాత్రమే ఆస్పత్రిలోకి  అనుమతిస్తామని అన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss