Thursday, May 13, 2021

Latest Posts

అతడి కోసం మెగా ఫ్యామిలీ ఏంచేసిందో తెలుసా….

అనుబంధం, ఆప్యాయత బూటకం అని అంటూంటారు. కానీ కొన్ని చోట్ల ఎంత బలంగా ఉంటాయో మాటల్లో చెప్పలేం. బంధుత్వం అక్కర్లేదని, ఆప్తులుగా ఉంటేచాలని అనిపిస్తుంది. మరి అలాంటి ఆప్తులు చనిపోతే తట్టుకోగలరా? అందుకే మెగా హీరోలు విషాదంలో మునిగిపోయారు. తాము నటించే సినిమాలనే కాదు,తమను కూడా ఆరాధ్య భావంతో చూస్తే వ్యక్తి పోయినపుడు ఇలానే ఉంటుందని ఈ ఘటన నిరూపించింది.

అందుకే బన్నీ ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న అల వైకుంఠపురం టీజర్ విడుదల కూడా వాయిదా వేసారు. వివరాల్లోకి వెళ్తే, గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి ఫాన్స్ అధ్యక్షుడు నూర్ మహ్మద్ కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధ పడుతూ కన్నుమూశాడు.

మెగా ఫామిలీ కి సంబంధించి ఏ సినిమా రిలీజ్ అయినా నూర్ మహ్మద్ ముందుండేవాడు. ఇతడికి రామ్ చరణ్ హార్ట్ ఆపరేషన్ చేయించగా, అల్లు అరవింద్ డబ్బు సాయం కూడా చేసాడు. మెగా హీరోల సినిమాలను పదేపదే చూడడమే కాకుండా,సేవా కార్యక్రమాల్లో ముండేవాడు. అందుకే మెగా హీరోలు ఇతడి మరణంతో చలించిపోయారు. దీంతో మెగా ఫామిలీ లో విషాదం నెలకొంది. హుటాహుటీన మెగాస్టార్ చిరంజీవి అతడి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి,కుటుంబాన్ని ఓదార్చారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss