Wednesday, April 21, 2021

Latest Posts

బ్రతికే ఉన్నాను-కిమ్

North Korean media is reporting that Kim Jong Un is still alive

నార్త్ కొరియా అధ్యక్షుడు, కిమ్ జాంగ్ చనిపోయారంటూ కొంతమంది ప్రచారం చేస్తుంటే, బ్రెయిన్ డెడ్ అని మరికొందరు అంటున్నారు. ఇలా ఆయన  ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజులుగా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఉత్తర కొరియా ప్రభుత్వం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. కిమ్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన మరణించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.  ప్రస్తుతం ఆయన ఓ రిసార్ట్ లో ఉన్నారని, అక్కడ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు చూసుకుంటున్నారని కిమ్ భద్రతా సలహాదారు తెలిపారు.

అలాగే అటు కిమ్ జాంగ్ కొరియాకు చెందిన టీవీ ఛానల్‌కు ఒక లెటరు ద్వారా తను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు  అక్కడి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఏప్రిల్ 15న కిమ్ తన తాత 108వ జయంతి వేడుకలకు దూరంగా ఉండటంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటం వల్లే ఆయన రాలేదంటూ వదంతులు ఎన్నో పుట్టుకొచ్చాయి. కానీ ఇప్పుడు నియంత నుంచే ఇలాంటి సందేశం  రావడంతో శత్రుదేశాల వారు భయపడుతున్నట్లు తెలుస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss