Monday, May 10, 2021

Latest Posts

విలీనం కానే కాదు .. పొత్తు  మాత్రమే .. పవన్ క్లారిటీ 

అన్న కాంగ్రెస్ లో కలిపేస్తే, తమ్ముడు బీజేపీలో పార్టీని విలీనం చేసేస్తున్నాడని కొన్ని రాజకీయ పక్షాలు,నేతలు ఆరోపణలు గుప్పిస్తుండగా, సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ విపరీతంగా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో  బీజేపీతో పొత్తుపై జనసేనాని పవన్‌కల్యాణ్ క్లారిటీ ఇస్తూ, బీజేపీలో విలీనం చేసే ఆలోచననే తనకు లేదని తేల్చిచెప్పారు. బుధవారం  ఢిల్లీలో బీజేపీ-జనసేన నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

ఎపి  రాజధానిపై బీజేపీ- జనసేన ఉమ్మడి కార్యాచరణ ఖరారు చేసుకున్నాయి. ఇకపై ప్రతి 15 రోజులకోసారి భేటీ కావాలని బీజేపీకి, జనసేన  పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి కార్యక్రమంలో రెండు పార్టీలు పాల్గొనాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం బీజేపీ అగ్రనేత జేపీ నడ్డాతో రెండు పార్టీల నేతలు సమావేశం కానున్నారు.అయితే ఇటీవల విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలు, జనసేన నేతలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా మాట్లాడుతూ దేశ ప్రయోజనాలే ప్రధాని మోదీకి ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దమనసుతో తమతో కలిసి వచ్చిన పవన్‌ కల్యాణ్‌కు మనస్పూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు  చెప్పారు. రెండు పార్టీలూ కలిసి నేతల నుంచి కార్యకర్తల వరకూ ఎలాంటి విభేదాలు లేకుండా దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తామన్నారు. కుటుంబం, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో జగన్‌ ప్రభుత్వం ప్రజల్లో చులకనైపోయిందని.. ఈ విషయాలను మరింత లోతుగా ప్రజలకు వివరించి 2024లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరతామని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. పవన్ క్లారిటీ ఇచ్చినా మరి ట్రోల్స్ ,విమర్శలు ఆగుతాయో లేదో చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss