Saturday, January 16, 2021

Latest Posts

ఎన్‌ఆర్‌ఐలను క్వారంటైన్‌లో ఉంచిన ఏపీ ప్రభుత్వం

వందే భారత్ మిషన్‌లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చారు. ఈ క్రమంలో చికాగో నుంచి ఓ ప్రత్యేక విమానం ఈరోజు హైదరాబాద్ చేరుకోగా ఆ విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 33 మంది ఉన్నారు. ఈ రోజు విదేశాల నుంచి వచ్చిన  ఏపీ వాసులను రిసీవ్ చేసుకోవడానికి వచ్చే బృందాలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే చికాగో నుంచి వచ్చిన ఏపీ వాసులను పెయిడ్‌ క్వారంటైన్‌కు ప్రభుత్వం తరలించింది. కానీ వారంత  తమ ఇళ్లకు తాము వెళ్లిపోతామంటూ కొందరు ఎన్‌ఆర్‌ఐలు అయితే  అధికారులపై ఒత్తిడి పెడుతోన్నట్టు చెబుతున్నారు. వారు హోమ్ క్వారంటైన్‌లో ఉంటామని తమకు గెస్ట్‌ హౌసులు ఉన్నాయంటూ పలువురు ఎన్‌ఆర్‌ఐలు అధికారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికి అధికారు లు మాత్రం వారిని  ఇళ్లకు పంపేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉందవలసిందేనని  స్పష్టం చేస్తున్నారు.

ఇంక  రెండో విడతగా వచ్చే ఎన్‌ఆర్‌ఐలకు కూడా అధికారులు. విజయవాడ, విశాఖ నగరాల్లో ప్రైవేటు హోటళ్లను పెయిడ్‌ క్వారంటైన్‌ కోసం వినియోగిస్తోంది ప్రభుత్వం.ఒక వేళ్ళ అవి సరిపోకపోతే  వినియోగించుకోవడాని  అనుగుణంగా  గుంటూరు, ఏలూరు వంటి నగరాల్లో కూడా హోటళ్లను సిద్దం చేస్తున్నారు అధికారులు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss