Wednesday, January 19, 2022

Latest Posts

ఎన్‌టి‌ఆర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ కాదట

NTR 30 Movie Heroine Is Not Kiara Advani

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం కోసం కొరటాల శివతో కలిసి పనిచేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. కోరటాల శివ సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కించడంలో దిట్ట. గతంలో వీరిద్దరూ కలిసి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన జనతా గ్యారేజ్ చిత్రం కోసం కలిసి పనిచేశారు.

అయితే ఇప్పుడు తాజాగా మరో సారి జత కట్టబోతున్న వీరిద్దరి కోసం హీరోయిన్ గా కియారా అద్వానీని బోర్డులోకి తీసుకురావాలని కొరటాల శివ యోచిస్తున్నట్లు ఇంతకుముందు చిత్ర పరిశ్రమలో బలమైన వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కియారా అద్వానీ నటించబోవడం లేదట, మరో బ్యూటీ పూజా హెగ్డే ఈ సినిమాలో నటించనుందట. ఈ ప్రాజెక్టుపై ఆమె ఇప్పటికే సంతకం చేసిందని, త్వరలో పూజ హెగ్డే ఈ సినిమాలో చేయడం పై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

ఎన్‌టి‌ఆర్ ఒక పక్క ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో బిజీగా ఉంటే, మరోవైపు పూజా హెగ్డే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి రాధే శ్యామ్‌లో నటిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss