Sunday, June 20, 2021

Latest Posts

ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను – తారక్

Junior NTR Birthday Celebrations

నందమూరి అభిమానులు కొన్ని రోజులుగా తారక రాముడి పుట్టిన రోజు ఎలా చేయాలా అని చాలా రకాల ప్లాన్స్ చేస్తున్నారు. ఈయన పుట్టిన రోజుని ఆయన అభిమానులు పండుగలా జరిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇలా జరపడం వల్ల అభిమానులు కరోనా భారీన పడే అవకాశం ఉండటంతో తారక్ అభిమానులకు ఇలా సందేశానిచ్చాడు.

“గత కొద్ది రోజులుగా మీరు పంపుతున్న సందేశాలు, వీడియోలు చూస్తున్నాను. మీ ఆశీస్సులు నాకెంతో ఊరట కలిగించాయి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ప్రస్తుతం నేను బాగున్నాను. త్వరలో పూర్తిగా కోలుకుని కోవిడ్‌ను జయిస్తాను. ప్రతి ఏటా మీరు నా పుట్టినరోజున చూపే ప్రేమ, చేసే కార్యక్రమాలు ఒక ఆశీర్వచనంగా భావిస్తాను. కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు ఇంటి పట్టునే జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇదే నాకు మీరందించే అతి పెద్ద కానుక”.

“ఇది వేడుకలు చేసుకునే సమయం కాదు. మన దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. కనిపించని శత్రువుతో అలుపెరగని పోరాటం చేస్తున్న మన డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు మన సంఘీభావం తెలపాలి. ఆత్మీయులను కోల్పోయిన వారికి అండగా నిలబడాలి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీరూ జాగ్రత్తగా ఉండండి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ చేతనైన ఉపకారం చేయండి. త్వరలో మన దేశం ఈ కరోనాను జయిస్తుంది అని నమ్ముతున్నా. ఆ రోజు అందరం కలిసి వేడుక చేసుకుందాం..” అని తారక్ అభిమానులను కోరాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss