NTR has passed on the Real Man challenge to Koratala Siva
వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. అన్ని రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఇక సినీ రంగం తీవ్రంగా దెబ్బతింది. ఎక్కడి సినిమాలు అక్కడే ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. అన్ని రంగాలవారు ఇంటికే పరిమితం అయినట్టే, లాక్డౌన్ సమయంలో సినీ సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాల్లో అలాగే సినిమా కార్మికులను,ప్రజలను కూడా ఆదుకునే కార్యక్రమాల్లో చురుగ్గా సెలబ్రిటీలు భాగస్వామ్యం వహిస్తున్నారు. అంతేకాకుండా ఇళ్లల్లో పనులు చేస్తూ ఒకరికొకరు ఛాలెంజ్‌లు విసురుతున్నారు. వీటిలో టాలీవుడ్లో ట్రెండ్ అవుతున్న ఛాలెంజెస్లో ‘బీ ద రియల్ మేన్’ ట్రెండ్ అవుతుంది. సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ ముందు రాజమౌళి అక్కడ నుండి తారక్, చరణ్, సుకుమార్, కీరవాణి, శోభు యార్లగడ్డ తదితరులకు ఛాలెంజ్ వెళ్లింది.ఆ ఛాలెంజ్‌ను తారక్ స్వీకరించి, ఇల్లు శుభ్రం చేస్తూ, గిన్నెలు సర్దుతూ, గార్డెన్ క్లీన్ చేస్తున్న వీడియోను షేర్ చేసి ‘‘పని భారాన్ని పంచుకోవడం ఓ సరదా’’ అని పేర్కొన్నారు . అలాగే ఈ ఛాలెంజ్‌కు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లను ట్యాగ్ చేశారు. ఎన్టీఆర్ ఛాలెంజ్ అంగీకరించిన చిరంజీవి ‘‘మీ దోస్త్ చరణ్ వీడియో ఎక్కడ? ఇంకా పెట్టలేదు. నేను వెయిట్ చేస్తున్నాను’’ అని స్పందించారు.
ఇక రామ్ చరణ్ కూడా తన ఛాలెంజ్ వీడియోను పోస్ట్ చేశారు. ‘‘బట్టలన్నీ సర్దడం, మొక్కలకు నీళ్లు పోయడం, ఫ్లోర్ శుభ్రం చేయడం, ఉపాసన (చరణ్ భార్య)కు కాఫీ కలిపి ఇవ్వడం వంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేశారు చరణ్. ‘‘ఇంటి పనులు చేయడం గర్వంగా భావిద్దాం. మన ఇంటి పనులు చేసి నిజమైన మగవాళ్లం అనిపించుకుందాం’’ అని పేర్కొన్నారు చరణ్. త్రివిక్రమ్, రణ్వీర్ సింగ్, రానా, శర్వానంద్‌లకు చరణ్ ఈ ఛాలెంజ్‌ను విసిరారు.అయితే కొరటాల శివ స్పందిస్తూ, ” థాంక్స్, ఛాలెంజ్ అంగీకరిస్తున్నా తారక్ అన్నయ్యా!.. ఇప్పటికే నెలరోజుల ఫుటేజ్ మిస్సయ్యింది’’ అంటూ తారక్ ఛాలెంజ్ కి ఫన్నీ ట్వీట్ చేశారు.