Sunday, June 20, 2021

Latest Posts

ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు సెన్సేషనల్ టైటిల్

NTR Koratala Siva Movie To Have Sensational Title

ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్ తరువాత ఏ సినిమా చేస్తాడని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే తను దర్శకుడు కొరటాల శివతో చేస్తాడని విని చాలా ఆనంద పడ్డారు అభిమానులు. ఆర్‌ఆర్‌ఆర్ తరువాత, ఇంతక ముందు జనతా గ్యారేజీకి దర్శకత్వం వహించిన శివతో చేసే సినిమాలో ఎన్‌టి‌ఆర్ ఒక శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు.

మొదట త్రివిక్రమ్ తో చేయాల్సిన తారక్ ఆ సినిమాను పక్కన పెట్టి శివ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి అభిమానులు ఎన్‌టి‌ఆర్ కి ఒక మాస్ హిట్ పడాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ విని అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇంతకీ సినిమా టైటిల్ ఏమిటంటే సెన్సేషనల్. ఈ టైటిల్ వినడానికే చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఇక ఇందులో ఎన్‌టి‌ఆర్ నటిస్తే తిరుగే ఉండదు అంటున్నారు ఇది విన్న సినీ జనం.

ఇదిలావుండగా, సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఈ సినిమా కి మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం, కోరటాల చిరంజీవి మరియు రామ్ చరణ్ యొక్క ఆచార్యలతో బిజీగా ఉన్నారు. ఆచార్య తరువాత, కొరటాల ఎన్.టి.ఆర్ తో కలిసి సినిమాని ప్రారంభిస్తాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss