Tuesday, April 13, 2021

Latest Posts

చెక్ పై రివ్యూ ఇచ్చిన తారక్

NTR Review On Check Movie

చంద్రశేఖర్‌ యేలేటి సినిమాలను వైవిధ్యంగా తెరకెక్కించడంలో దిట్ట. అయితే ఈ దర్శకుని సినిమాలు కొన్ని పెద్దగా హిట్టవ్వలేదు. దీంతో కొంత నిరుత్సాహపడ్డ ఆయన ఐదేళ్ల విరామం తర్వాత చెక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నితిన్‌ హీరోగా, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాడు. ఈ సినిమా రేపు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సందర్భంగా చెక్‌ యూనిట్‌కు బెస్ట్‌ విశేష్ చెప్పాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్. వైవిధ్యమైన కథలతో అలరించే చంద్రశేఖర్‌ యేలేటికి తనెప్పుడూ అభిమానినే అంటూ ట్వీట్‌ చేశాడు. చెక్‌ చాలా ఆసక్తికరంగా ఉందని సినిమాపై ప్రశంసలు కురిపించాడు. కాగా చంద్రశేఖర్ గారు చెప్పిన 15 నిమిషాల కథ విని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా అని నితిన్‌ ఆ మధ్య స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్‌’ వేరని, ఇందులో తన నటన వినూత్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణీ మాలిక్‌ సంగీతం అందించాడు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss