Monday, May 10, 2021

Latest Posts

కొడుకు తో కలిసి బండి పై షికార్లు చేస్తున్న ఎన్‌టి‌ఆర్

NTR With Son Bhargav Ram Photo

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో ఎక్కువగా గడుపుతాడు అలానే పార్టీలు మరియు ఇతర కార్యక్రమాల్లో  అరుదుగా కనిపిస్తాడు.

తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో పాటు ఎన్టీఆర్ తన ఖాళీ సమయాన్ని ఎక్కువగా గడుపుతారు. తాజాగా, తన కుమారుడు భార్గవ్ రామ్‌తో పాటు జూనియర్ ఎన్‌టీఆర్ బైక్ పై వెళుతూ కనిపించిన ఫోటోలను నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్ ను బుల్లెట్ బైక్ పై ఎక్కించుకుని నడుపుతున్నట్లు మనం చూడవచ్చు.

అయితే ఎన్‌టి‌ఆర్,వెనుక కూర్చున్న వ్యక్తి మాస్క్ పెట్టుకున్నారు కానీ ఎన్‌టి‌ఆర్ కుమారుడు భార్గవ్ రామ్ కు మాత్రం మాస్క్ ని వేయలేదు. దీనితో అతని అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. కరోనా పెట్టుకుని ఇలా మాస్క్ లేకుండా రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం హైదరాబాద్ లోని జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గర తీసినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss