Wednesday, September 23, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

నువ్వు నేను సినిమా ఎలా పుట్టిందో తెలుసా

చిత్రం మూవీ తర్వాత మళ్ళీ తేజ డైరెక్షన్ లోనే ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను మూవీ బ్లాక్ బస్టర్. చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా కొన్నవారికి 10రెట్ల లాభాలు వచ్చాయి. 20కోట్ల గ్రాస్ వసూలు చేసి,70కేంద్రాల్లో 100రోజులు ఆడింది. హైదరాబాద్ సింగిల్ థియేటర్ లో కోటి వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా,పాట విన్నా, ఈ పెద్దోళ్లున్నారే అనే డైలాగ్ విన్నా అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా యూత్ లో క్రేజ్.

చిత్రం మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ తర్వాత సినిమా విక్టరీ వెంకటేష్ తో బుక్ అయింది. అన్నీ ఒకే అనుకున్నాక కథ వినిపించాడు. అయితే మరో స్టోరీ తయారుచేయమని చెప్పి,నువ్వు నాకు నచ్చావ్ మూవీకి వెంకీ కమిట్ అయ్యాడు. దీంతో విసుగు చెందిన తేజ కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే రోడ్డు అడ్డంగా గొర్రెలు తోలుకొస్తున్న అమ్మాయి,అటువైపు విసుగ్గా ఖరీదైన కారులో ఓ యువకుడు, ఈ సీన్ చూసాక తేజ బుర్రలో ఏదో ఐడియా వచ్చింది.

వెంటనే వెంకీతో తీద్దామనుకున్న నిర్మాతను కల్సి,వెంకీతో సినిమా కేన్సిల్ అయింది కనుక ఇప్పుడు ఇంకో సినిమా స్టోరీ చెబుతాను విను అంటూ ‘హీరో కోటీశ్వరుడు, హీరోయిన్ గొర్రెలు కాసుకునే వాడి కూతురు’ఇలా కొన్ని సీన్స్ చెప్పడంతో సినిమాకు రెడీ అయ్యాడు. ముహూర్తం బాగుందని షూటింగ్ కూడా మర్నాడే స్టార్ట్ చేసి,అప్పుడు స్టోరీ మీద కూర్చున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్,దశరధ్ రైటర్స్ గా సహకరించారు. హీరో ,హీరోయిన్స్ తప్ప మిగతావాళ్లంతా రెడీ అయ్యారు. సుమంత్ ని అడిగితె ఒప్పుకోలేదు, మాధవన్ రిజక్ట్ చేసాడు. ఇక ఎవరితో చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో హీరో ఉదయ్ కిరణ్ వచ్చాడు. తొలిమూవీకి డైరెక్టర్ కావడంతో గాడ్ ఫాదర్ గా భవిస్తూ,తన తర్వాత సినిమా గురించి సలహా కోసం వచ్చాడు. అయితే తేజ ఏమీ మాట్లాడకపోవడంతో ఏదో ఆలోచనలో ఉన్నారనుకుని లేచి వెళ్లిపోతుంటే,’నువ్వు జిమ్ చేసి బాడీ బాగా పెంచు. తర్వాత సినిమాలో నువ్వే హీరో’అని తేజ చెప్పడంతో ఉదయ్ ఆనందానికి అవధుల్లేవ్.

ఇక హీరోయిన్ సెలక్షన్ కోసం వందమందితో ఆడిషన్స్ నిర్వహించగా, ఒక అందమైన అమ్మాయిని సెలక్ట్ చేసారు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలిసిపోయింది. దీంతో ఫలానా హోటల్ కావాలి,ఫలానా కారు కావలి అంటూ బిల్డప్ ఇవ్వడంతో తేజకు కోపం చిర్రెత్తుకొచ్చింది. అక్కడున్న అమ్మాయిల్లో చూసి,వీళ్లల్లో చీప్ ఎవరనిపిస్తోంది అని అడిగాడు. దాంతో సదరు హీరోయిన్ ఓ అమ్మాయిని చూపించడంతో,అయితే ఆమె నా హీరోయిన్,ఇక నువ్వేళ్లొచ్చు అని చెప్పడంతో ఆమె షాకయింది. అలా అనిత హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. హైదరాబాద్,ముంబయి,వికారాబాద్ లలో షూటింగ్ చకచకా చేసారు.

మొత్తం 11పాటలు,అందులో మూడు తీసేద్దామని ప్రొడ్యూసర్ అనగానే తేజ వద్దన్నాడు. కోటి 60లక్షల బడ్జెట్ తో 2001ఆగస్టు 10న మూవీ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్. పాటలు హిట్,డైలాగ్స్ సూపర్,స్క్రీన్ ప్లే అదిరింది. దీంతో ఉదయ్ కి రాష్ట్రవ్యాప్తంగా ఫాన్స్ వస్తే, తేజ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్,లిరిక్ రైటర్ కులశేఖర్,ధర్మవరపు సుబ్రహ్మణ్యం,తెలంగాణ శకుంతల,వైజాగ్ ప్రసాద్ లకు బ్రేక్ ఇచ్చింది. అవార్డులు కూడా తెచ్చిపెట్టిన సినిమా ఇది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...