హైదరాబాద్ లో ఈ రోజు (శనివారం) సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎలాంటి మబ్బలు లేకుండా ఆహ్లదకరంగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి హఠాత్తుగా మేఘాలు కమ్ముకున్నాయి. చిరు జల్లులతో ప్రారంభమైన వాన.. రోడ్లు జలమయం అయ్యేలా భారీ వర్షం కురిసింది. దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, ఎల్బీనగర్, మీర్పేట్, హయత్నగర్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు నగరంలో వరద కష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి భారీ వర్షం కురవడంతో ఆందోళన చెందుతున్నారు వరద బాధితులు.
ఇది కూడా చదవండి: