Home వైరల్ ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్

ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక్ నిర్ణయం తీసుకుంది. ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు పలు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటే ఒక పింఛన్‌ను ప్రభుత్వం రద్దు చేయనుంది. కాగా ఈ అమలులో దివ్యాంగులకు, వ్యాధిగ్రస్తుల పింఛన్లకు మినహాయింపు ఇచ్చింది.

ఆధార్ కార్డు, ప్రజాసాధికార సర్వేల ఆధారంగా రాష్ట్రంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పింఛన్లు పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వాటిని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించి పురపాలక కమిషనర్ లేదా ఎంపీడీవోలకు పంపించింది. ఈ నెల 15వ తేదీలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవమైతే ఒక పింఛను రద్దు చేయనున్నారు. ఇప్పటికే కరెంట్ బిల్ 300 పాయింట్స్ కన్నా ఎక్కువ ఉన్న పెంక్షనర్స్ కు పింఛన్ ఆపి వేసిన ప్రభుత్వం. కాగా ఈ చర్యల వలన ప్రజలు ఎలా స్పందిస్తారో చూడవలసి ఉంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో 51 పాజిటివ్ కేసులు

Exit mobile version