Thursday, January 28, 2021

Latest Posts

ఆ ఆర్డినెన్స్ దుర్మార్గం,దారుణం 

Opposition is fueled by the removal of the AP election commissioner

ఎపి ఎన్నికల కమీషనర్ ని తొలగిస్తూ, ప్రభుత్వం జీవో ఇవ్వడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు  కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని రమేష్ కుమార్‌పై జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకున్నారని  ఆరోపించారు. ఏపీ ఎన్నికల కమిషనర్  తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ఏపీ గవర్నర్‌కు  లేఖ రాశామన్నారు.ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతీకారంతో తీసుకువచ్చిన ప్రతిపాదిత ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఈ అంశాన్ని పరిశీలించమని కోరారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించేలా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను తిరస్కరించాలని కోరినట్లు లేఖలో కన్నా పేర్కొన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ … కరోనా సమయంలో రాజకీయాలు ఏమిటని, ఎన్నికల కమీషనర్ తొలగింపుపై ధ్వజమెత్తారు.  సీపీఐ నేత రామకృష్ణ స్పందిస్తూ, రమేష్‌కుమార్‌ను తొలగించే అధికారం జగన్‌ ప్రభుత్వానికి లేదన్నారు.  ఎస్‌ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందన్నారు.   పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ   రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకురావడం సీఎం నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. తన మాట విననందుకే లక్ష్యం చేసుకుని జగన్‌ ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని అన్నారు.

టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ   కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్‌ కాపాడారని  తెలిపారు. సుప్రీంకోర్టు కూడా రమేష్ కుమార్ నిర్ణయాన్ని ఆమోదించిందన్నారు. స్థానిక ఎన్నికల వాయిదాతో సీఎం జగన్ అహం దెబ్బతిందని, వైసీపీ ప్రభుత్వం తనకు లేని అధికారాలతో రమేష్‌పై దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు. జగన్‌కు తాను అనుకున్నది జరగాలనే మూర్ఖత్వం తప్ప.. ప్రజల యోగ క్షేమాలు పట్టవని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss