opposition parties comments on kcr over Telangana Lockdown
నిన్న మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మీడియాపై చేసిన వాక్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు, హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, టీసిఎల్పీ నేత భట్టీ విక్రమార్క, ఐజేయూ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మరియు పలువురు నేతలు మండిపడ్డారు. సలహాలు, సూచనలు ఇస్తే మీడియా వారికి కరోనా వైరస్ రావాలని, ఇంట్లో పడుకోవాలి అన్న కేసీఆర్ వ్యాఖ్యలను వారంతా తప్పుబట్టారు.
ప్రజలకు కేసీఆర్ ఏం చెప్పాలని అనుకుంటున్నారు…..? వారికి కరోనా రావాలని అంటారా, ఇలాంటివి ఎవరైనా కోరుకుంటారా… ? అని వ్యాఖ్యానించారు. శత్రువులకైనా కరోనా రావద్దని కోరుకుంటామన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తే వారికి కరోనా రావాలని ముఖ్యమంత్రి కోరు కోవడం ఎక్కడ చూడలేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు.