Thursday, December 2, 2021

Latest Posts

రండి మా మాట వినండి మిస్టర్ మోడీ

Opposition’s 3-minute video to Modi

కొద్దిరోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న తరుణంలో రండి మా మాట వినండి మిస్టర్ మోడీ అంటు తృణముల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ ఒబ్రయెన్ మూడు నిమిషాల వీడియోను ట్విట్టర్ వేదికగా విడుదల చేసారు. పెగాసస్, వ్యవసాయ చట్టాలు, ఇతరత్రా కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నా అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో పార్లమెంట్ స్తంభిస్తోంది కానీ వారి డిమాండ్లను వినటంలేదు. దాంతో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా విపక్ష సభ్యులు మాట్లాడిన దృశ్యాలను ఒక వీడియో రూపంలో చేసి వారి నిరసనను తెలిపారు ప్రతిపక్ష నేతలు.

ఆ వీడియో లో మోడీ గారిని ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలకు హాజరు కావాలని ప్రతిపక్ష నాయకుల డిమాండ్లను వినాలని టీఎంసీ నాయకులు కోరారు. పెగాసస్, స్పైవేర్, వ్యవసాయ చట్టాలపై గత కొద్దిరోజులుగా పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న అంశాలపై చర్చకు అనుమతించడం లేదని, ధైర్యం ఉంటే ఇప్పుడే చర్చలు ప్రారంభించాలని కాంగ్రెస్ సభ్యులు మల్లిఖార్జున్ ఖర్గే మరియు ప్రతిపక్షాలకు చెందిన పలు పార్టీల సభ్యులు మాట్లాడిన అంశాలు ఆ వీడియోలో వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss