Sunday, June 20, 2021

Latest Posts

పుష్ప సినిమా కోసం ఆస్కార్ అవార్డ్ విన్నర్

Oscar Award Winner For Pushpa Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప భారీగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం సౌండ్ డిజైన్‌ కోసం ఆస్కార్ విజేత అయిన రేసుల్ పూకుట్టి ని తీసుకొచ్చారు చిత్ర నిర్మాతలు. రానా దగ్గుబాటి ఆరణ్య కోసం రేసుల్ ఇటీవలే అదిరిపోయే సౌండ్ డిజైన్ ఇచ్చారు ఆయన. పుష్ప సినిమా కూడా చాలా భాగం అడవులలో ఉంటుంది మరియు అందువల్ల, సౌండ్ డిజైన్ కీలక పాత్ర పోషిస్తుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప బృందం టీజర్‌ను విడుదల చేసింది. దీనిలో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా ఆగస్టు 13 వ తేదీన పుష్పాను ప్రకటించారు.

అయితే షూటింగ్ ఆలస్యం కావడం, కోవిడ్ -19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా సినిమా వాయిదా పడుతుందని పుకార్లు కూడా ఉన్నాయి. 2021 డిసెంబర్ లేదా జనవరిలో మాత్రమే పుష్ప విడుదల చేయవచ్చని బజ్. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా, రష్మిక ఒక గిరిజన స్త్రీ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం దాదాపుగా 180 కోట్లతో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss