Thursday, December 2, 2021

Latest Posts

కే‌జి‌ఎఫ్ 2 కి ఓటిటి సంస్థ భారీ ఆఫర్

OTT Platform Offered Huge Amount For KGF Chapter 2

పాన్ ఇండియా సినిమా కే‌జి‌ఎఫ్ చాప్టర్: 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కే‌జి‌ఎఫ్ 1 సృష్టించిన సునామితో, కే‌జి‌ఎఫ్ 2 పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే, కే‌జి‌ఎఫ్ 2 టీజర్ యూట్యూబ్‌లో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది మరియు 200 మిలియన్లకు పై గా వ్యూస్ సంపాదించింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 16 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది, కానీ లాక్డౌన్ కారణంగా సినిమా వాయిదా పడింది. ఇప్పుడు థియేటర్లు మళ్ళీ ఓపెన్ కావడంతో సినిమాను థియేటర్ లో విడుదల చేయాలని చూస్తుంది చిత్ర బృందం. అయితే ఈ లోపు ఒక పెద్ద ఓటిటీ ప్లాట్‌ఫాం కే‌జి‌ఎఫ్ 2 డిజిటల్ విడుదల కోసం భారీ డీల్‌ను ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ డీల్ దాదాపు 255 కోట్లు అని సమాచారం. దీనితో కే‌జి‌ఎఫ్ 2 మేకర్స్ ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇండియన్ సినిమాలలో ఇది అత్యంత భారీ ఓటిటీ ఆఫర్ అని తెలిసింది. మరీ కే‌జి‌ఎఫ్ చిత్ర బృందం ఏం చేస్తుందనేది కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss