Monday, April 19, 2021

Latest Posts

కరోన వ్యాక్సిన్ తయారీలో ముందున్న ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు

Oxford scientists are the first of corona vaccine manufacture

చైనా లోని వ్యూహన్  సిటీ లో పుట్టిన కరోనా వైరస్ కు ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయి. దానిని ఎదుర్కొనడానికి ప్రపంచ దేశాలు చెయ్యని ప్రయత్నం లేదు. అలాగే మన భారత్ దేశంలో కూడా దానిని ఎదుర్కొనడానికి రకరకాల వ్యాక్సిన్ లను తయారు చేసే పనిలో పడ్డాయి. ఈ ప్రక్రియలో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం వారు కొంత మేర విజయం సాదించము అని ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం  శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను తయారు చేసి ఆరు కోతులపై కూడా ప్రయోగించారు.  ఆరు కోతులకు ఈ  వ్యాక్సిన్ ఇవ్వగా అవి వైరస్ ను అదుపు చేసి నట్లు తెలుస్తోంది.

మరలా ఇంకో ఆరు కోతులపై వ్యాక్సిన్ ను  ప్రయోగం నిర్వహించగా అవి కూడా మంచి ఫలితాలు ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  కోతులపై ప్రయోగించిన వ్యాక్సిన్ కొంతమేర  విజయం సాధించడంతో మనుషులపై కూడా తప్పకుండా విజయం సాధిస్తామని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే కోతుల డీఎన్ఏకు మనుషుల డీఎన్ఏ కు 93 శాతం దగ్గర పోలికలు ఉంటాయి. కోతులపై వ్యాక్సిన్ ప్రయోగం ఫలిస్తే దానిని మనుషులపైనా ప్రయోగించి విజయం సాధించడానికి అవకాశం ఉందంటు దిమ వ్యక్తం చేస్తున్న ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు. అనుకున్నవన్ని జరిగితే సెప్టెంబర్ నాటికి ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss