Thursday, January 21, 2021

Latest Posts

వైద్యులపై లాఠీచార్జి,అరెస్టు – ఎక్కడో తెలుసా

Pakistan arrests doctors protesting for coronavirus medical kits

కనీవినీ ఎరుగని రీతిలో   కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. ఆ వైరస్ బారి నుంచి బయట పడేందుకు ప్రపంచ దేశాలు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలను వైద్యులు వైద్య సిబ్బంది రక్షిస్తున్నారు. అందుకే ఈ  విపత్కర సమయంలో వైద్యులు శాస్త్రవేత్తలు వైద్య సిబ్బందిని ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్నారు. అయితే  పాకిస్తాన్లోని క్వెట్టాలో ఇందుకు భిన్నంగా  ఉంది.  కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నా,  విధులు నిర్వహించే వైద్యులు వైద్య సిబ్బందికి పరికరాలు సామగ్రి కొరత ఏర్పడింది.  ఈ క్రమంలో చికిత్స చేసే వైద్యులు వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) కిట్ల కొరత ఉంది.

మాస్కులు గ్లౌజులు చేతి తొడుగులు దుస్తులు అందుబాటులో లేవు. ఈ పీపీఈ కిట్లను అందించాలని కొన్ని వారాలుగా వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పత్రి ఎదుట వైద్యులు ఆందోళనకు దిగారు.  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని  తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆందోళన చేయగా పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేయడంతో పాటు అరెస్ట్ చేశారు. మొత్తం 53 మంది వైద్యులు వైద్య సిబ్బందిని అరెస్ట్ చేశారు.

అయితే ఈ ఘటనపై బలూచిస్తాన్ ప్రభుత్వం స్పందిస్తూ, పీపీఈ కిట్ల కొరత  వాస్తవ మేనని చెబుతూనే వైద్యుల తీరును ఖండించింది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నా వైద్యులు వైద్య సిబ్బంది సహనం కోల్పోయి 144 సెక్షన్ను ఉల్లంఘించి నిరసన చేపట్టారని పేర్కొంది. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ఆ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పాకిస్తాన్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 3469 నమోయ్యాయి. 50 మంతది చనిపోయారు. అయితే వైద్యులపై లాఠీ ఛార్జి చేయడం,అరెస్టు చేయడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. విపత్కర పరిస్థితు ల్లో వైద్యులను రక్షించుకోవాలి, కానీ ఇలా చేయడం తగదని తప్పుబడుతున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss