Home క్రీడలు పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం

పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం

Pakistan Beat India By 10 Wickets, India vs Pakistan T20 World Cup Match,Pakistan Beat India, India vs Pakistan T20 World Cup, India vs Pakistan, India vs Pakistan T20, India vs Pakistan T20 Match

Pakistan Beat India By 10 Wickets

అంతా అయిపొయింది! ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన భారత అభిమానులకు పూర్తిగా నిరాశగా మారింది. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం చూసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్‌కు ఘోర పరాజయాన్ని అందించింది. ఓపెనర్లు బాబర్ అజామ్ (68), మహమ్మద్ రిజ్వాన్ (79) సాయంతో పాకిస్తాన్ కేవలం 17.5 ఓవర్లలో భారత్ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ భారత్‌ను ఓడించడం ఇదే మొదటిసారి.

భారత్ నిర్దేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో పాకిస్తాన్ అద్భుతమైన ప్రారంభాన్ని సాధించింది. బాబర్ అజామ్ మరియు మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ సంచలనాత్మక నాక్స్ ఆడారు మరియు ఇన్నింగ్స్ అంతటా భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. పాక్ ఓపెనర్ల వికెట్లు ఎలా పడగొట్టాలో తెలియక భారత బౌలర్లంతా తల పీకున్నారు.

ఇకపోతే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న పాకిస్తాన్ కెప్టెన్ కు అంతా అనుకున్న వ్యూహం ప్రకారం సాగింది. ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్ తో అవుట్ అవ్వడం మరియు మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా తక్కువ పరుగలకే అవుట్ కావడంతో భారత్ పూర్తిగా తడబడింది.

తరువాత, విరాట్ కోహ్లీ (57) మరియు రిషబ్ పంత్ (39) ఇన్నింగ్స్‌ను పరిష్కరించడానికి ప్రయత్నించారు. పంత్ ఔటైన తర్వాత, మరే ఇతర బ్యాట్స్‌మెన్ ఆట వేగాన్ని పెంచలేకపోయారు. పాక్ బౌలర్లు షహీన్ ఆఫ్రిది (3/31), హసన్ అలీ (2/44) భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. విరాట్ యొక్క ఒంటరి పోరాటంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 151/7 స్కోరు చేయగలిగింది. భారత్ యొక్క తదుపరి మ్యాచ్ అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో జరగనుంది.

ఇది కూడా చదవండి: 

Exit mobile version