Pakistan trying to hack indian military secrets
కరోనా మహమ్మారి ప్రపంచం అంతా ఊపిరి సలపానీయ్యకుండా చేస్తుంటే, కొన్ని దేశాలు మాత్రం వాటి దుశ్చర్యలు మాత్రం ఇలాంటి సమయాల్లోనూ బయటపెడుతున్నాయి. భారత్ దేశాన్ని దెబ్బ కొట్టడానికి మన పొరుగు దేశం పాకిస్తాన్ ఇలాంటి తుట్టరపాటు చర్యల్ని చేస్తుంది. నిన్న కాక మొన్న భారత సరిహద్దుల్లో కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్, ఆ సమయాల్లో కరోనా ఉన్న ఉగ్రవాదులను ఇండియా లోకి పంపడానికి సకల ప్రయత్నాలు చేసింది. కాగా ఇండియన్ గవర్నమెంట్ కరోనా ట్రాకింగ్ కు ఉపయోగపడే ఆప్ “ఆరోగ్య సేతు”ను ప్రవేశపెట్టింది.
ఈ ఆప్ ను అనుకరించి ఆరోగ్య సేతు.ఏపికే అనే డూప్లికేట్ ఆప్ ఒకటి తయారుచేసి ఇండియన్ మిలిటరీ సభ్యులకు వాట్స్ ఆప్ కు ఫార్వార్డ్ చేసి, డౌన్లోడ్ చేసుకునే లింక్ కు పంపుతుంది. ఇలా ఎవరు డౌన్లోడ్ చేసుకున్నా వారి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇండియన్ మిలిటరీ సీక్రెట్స్ ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని ఇండియన్ మిలియటరీ చీఫ్ మనోజ్ ముకుంద్ నర్వానే మీడియా సమావేశంలో తెలియచేసారు. పాకిస్తాన్ భారత్ ఉన్నత అధికారుల ఫోన్లు హ్యాక్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.