Pakistan cricketer’s objectionable comments on Modi:
మోడీపై పాక్ క్రికెటర్ అభ్యంతరకర వ్యాఖ్యలు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది నోటి దురుసు మళ్ళీ బయట పడింది. భారత ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసాడు. నరేంద్ర మోడీ ప్రధానిగా పదవిలో ఉన్నంత కాలం భారత్ పాక్ దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరగవు అంటూ కామెంట్ చేసాడు. అంతే కాదు 2014 లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి అంటూ వివాదం రాజేసాడు.
పాకిస్తాన్ లో ఒక TV ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆఫ్రిది భారత్ పాకిస్తాన్ ల మధ్య మంచి సంబంధాలు లేకపోవడానికి ఒకే వ్యక్తి కారణం.. ఆయనే భారత దేశ ప్రధాని మోడీ. ఆయన అధికారంలో ఉన్నంత కాలం పాకిస్తాన్ లో క్రికెట్ ఆడేందుకు భారత్ రాదని అన్నాడు. అసలు మోడీ అజెండా ఏమిటో ఆయన ఏం చేయాలనుకుంటున్నారో తనకైతే అర్ధం కావట్లేదు అన్నాడు. సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి ఒకరు ప్రయాణించాలి అని కోరుకుంటున్నారు అని కానీ మోడీ ఆలోచనలు మాత్రం తిరోగమనాన్ని సూచిస్తున్నాయి అని ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
అయితే టీం ఇండియా చివరి సారిగా 2006 లో రాహుల్ ద్రావిడ్ నాయకత్వంలో పాకిస్తాన్లో పర్యటించింది. 26/11 ముంబై దాడుల తర్వాత ఇరుదేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బ తినడంతో ఇక అప్పటి నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో అడుగుపెట్టలేదు. కానీ ఐసీసీ వేదికగా టోర్నమెంట్ లో మాత్రం భారత్ పాక్ జట్లు తలపడుతున్నాయి.