జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా, వారికి ఎలాంటి అసౌకర్యాలు ఎదురుకాకుండా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓ వెబ్ సైట్‌ను ఆయన ప్రారంభించారు. నేత్రదానం చేయాలనుకుంటున్న వారికి పోర్టల్ ద్వారా అన్ని వివరాలు అందిస్తామని తమిళనాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం, పళనిస్వామికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, తమిళనాడు రాష్ట్ర అంధత్వ నియంత్రణ సంఘం, రాష్ట్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎస్వీ చంద్రకుమార్ సర్టిఫికెట్ అందజేశారు. పళనిస్వామి గర్వించదగిన కంటి దాత అని, తన నేత్రాలను బహుమతిగా ఇవ్వడం ద్వారా దేశాన్ని అంధత్వరహితంగా చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు ఆ సర్టిఫికేట్ పేర్కొంది. సీఎం నేత్రదానం ప్లెడ్జ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో నేతద్రానం చేసిన తొలి ముఖమంత్రి పళనిస్వామి అని, ఆయనను చూసి తాము గర్విస్తున్నామని పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేయగా, గ్రేట్ వర్క్, హ్యాట్పాఫ్ అంటూ మరికొందరు ప్రశంసించారు. ప్రతి ఏడాది ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకూ జాతీయ నేత్రదాన ఫోర్ట్‌నైట్ జరుగుతుంటుంది.
ఇది కూడా చదవండి: