Sunday, June 13, 2021

Latest Posts

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం మూడు నెలల సమయంలో బ్రిడ్జి పనులు పూర్తిచేశారు. ఈ స్టీల్ గేట్ అందుబాటులోకి రావడంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎల్వీ ప్రసాద్ మీదుగా పంజాగుట్ట వచ్చే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.పంజాగుట్ట శ్మశానవాటిక – చట్నీస్‌ హోటల్‌ మధ్య ఇరుకుగా ఉన్న రోడ్డును ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చేసేందుకు 23 కోట్ల వ్యయంతో ఒకవైపు స్టీల్‌ బ్రిడ్జిని నిర్మించారు. మరోవైపు రోడ్డును రెండు లేన్ల మేరకు విస్తరించేందుకు భూసేకరణ చేపట్టారు. ఇందులో భాగంగానే 5.95 కోట్లతో చేపట్టిన స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని ఫిబ్రవరి 29న పనులు ప్రారంభించి లాక్‌డౌన్ సమయంలో అత్యంత వేగవంతంగా పనులు చేపట్టి ఈ ప్రాజెక్టును మే చివరి వరకు పూర్తిచేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

ఇది కూడా చదవండి :

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss