ఈ రోజు పరిటాల శ్రీరామ్ కి కొడుకు పుట్టాడు. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమం. దీంతో పరిటాల రవి పుట్టాడు అంటూ ఫ్యామిలీ, వారి అనుచరులు అంతా ఫుల్ హ్యాప్పీ. అచ్చం నాన్నలాగే ఉన్నాడు, అచ్చం తాతలాగే ఉన్నాడు అంటూ స్వీట్లు పంచుకుంటూ బిందాస్ గా జోష్ గా దిల్ దార్ గా ఉన్నారు. 2017లో పెళ్లైన పరిటాల శ్రీరామ్ కి కొడుకు పుట్టడంతో ఫుల్ హ్యాప్పీ. కొడుకుని ఎత్తుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి. కొడుకు పుట్టాడన్న వార్త మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాప్పీగా ఉందన్నారు. దీంతో ఆయన ఫాలోవర్స్ పరిటాల రవి ఫాలోవర్స్ ఫుల్ హ్యాప్పీ. మా రవన్నే మళ్లీ పుట్టాడు అంటూ.రిప్లైస్ ఇస్తూ పరిటాల శ్రీరామ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరొక వైపు రవన్న పేరే పెట్టండి అంటూ రిక్వస్టులు పెడుతున్నారు. ఇదే టైంలో ఇంకో శుభవార్త కూడా విన్నారు పరిటాల శ్రీరామ్. ఇన్నాళ్లూ టీడీపీలో ఓ మంచి లీడర్ గా బానే గుర్తింపు ఉంది. ఓన్ నేమ్ కూడా ఫుల్ పాపులర్. ఇప్పుడు పార్టీ పదవి కూడా దక్కింది. అధికార ప్రతినిధిగా గుర్తింపు ఇచ్చింది టీడీపీ. అలాగే ఏపీలో టీడీపీని స్ట్రాంగ్ గా చేసి సైకిల్ స్పీడ్ పెంచాలని ఫామ్ చేసిన రాష్ట్ర కమిటీలో పరిటాల శ్రీరామ్ కి కూడా స్పేస్ ఇచ్చింది. దీంతో పరిటాల శ్రీరామ్ కి తండ్రిగా ప్రమోషన్ రావడం అధికార ప్రతినిధిగా పార్టీలో ప్రమోషన్ రావడం ఒకే సారి జరిగాయి.
ఇది కూడా చదవండి:
-
హోం క్వారంటైన్ లో గౌతం గంభీర్
- మెహర్ రమేష్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్