paritala family has posed five demands to the ap government
రాష్ట్రాoలో కరోనా వైరస్ అదుపు చేయ్డంలో మరియు లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు, రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. ఈ మేరకు పరిటాల ఫ్యామిలీ 12 గంటల నిరాహార దీక్ష చేస్తూ, 5 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
కాగా వారు ప్రతి పాదించిన డిమాండ్లు ఏమనగా లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయిన ప్రతి కుటుంబానికి తక్షణమే రూ. 5 వేల రుమపాలు అందజేయాలని, మూసేసిన అన్న క్యాంటిన్లు తెరిచి పేదవాళ్లకు రెండు పుటల బోజనం అందేలా చూడాలని, రైతుల దగ్గర నుంచి పంటలు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించి అర్హులకు వెంటనే భీమా మొత్తం చెల్లించాలి, అలాగే కరోనా నియంత్రణకు పోరాడుతున్న వైద్యులు, పోలీసులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని ఐదు డిమాండ్ లను ప్రభుత్వం ముందు ఉంచారు.