Tuesday, January 25, 2022

Latest Posts

తగ్గేదే లేదంటున్న విపక్షాలు

Parliament Monsoon Session Today

ఉభయసభలనూ పెగాసస్‌ స్పైవేర్ మరోసారి కుదిపేసింది. ఫోన్ హ్యాకింగ్‌ పై చర్చ జరగాల్సిదే అన్న నినాదాలతో ఉభయసభలూ దద్దరిల్లాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పదేపదే వాయిదా పడ్డాయి. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష పార్టీల సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు. ఫోన్ హ్యాకింగ్‌పై చర్చకు పట్టుబట్టిరు. అయితే కాంగ్రెస్‌ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్‌ ఛైర్‌పైకి, ట్రెజరీ బెంచ్‌లపైకి విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారు ఇలా ఆందోళనలు కొనసాగుతుండగానే సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టడంతో ప్రతిపక్ష సభ్యులు నినాదాలను మరింత ఉధృతం చేశారు. దాంతో స్పీకర్ విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియంపై కాగితాలు విసిరినందుకు సభాపతి 10 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. విపక్షాల నిరసనలతో సభ ప్రారంభమైన కొద్దిసేటికే వాయిదా పడింది.

ఇది కూడా కాదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss